బి ఆర్ కె భవన్ హైదరాబాద్
4/03/2024
ప్రజా బలం న్యూస్ :-
50% ఫిట్మెంట్ ను ఇవ్వాలని విజ్ఞప్తి…..
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రెండవ PRC కమిషన్ చైర్మన్
శివశంకర్ ను కలిసి తపస్ యొక్క ప్రతిపాదనలు సమర్పించినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు నవాత్ సురేష్ తెలిపారు. ఈ ప్రతిపాదనలలో ముఖ్యంగా ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం సవరణ చేయాల్సి ఉంది అని కమిటీకి సూచించారు. దానిలో భాగంగా ఫిట్మెంట్ 50% అందించాలి అని, కనీస వేతనం 35 వేల రూపాయలు ఉండాలని, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి స్కూల్ అసిస్టెంట్ కి మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని,మోడల్ స్కూల్ లో పనిచేసే పీజీటీల వేతనాన్ని జూనియర్ కాలేజీలో పని చేసే JL తో సమానం చేయాలని, గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అదనంగా ఒక పారిటీ స్కేల్ ను ఇవ్వాలని, 2017 TRT ద్వారా నియమించబడిన ఉపాధ్యాయులు 2020 PRCలో 4 స్కేల్ లు నష్టపోయిన కారణంగా వారికి అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, చైల్డ్ కేర్ లీవ్ ని రెండు సంవత్సరాలకు పెంచాలని తదితర ప్రతిపాదనలు చేయడం జరిగిందని వారు తెలిపారు. అలాగే ఎస్ఎంసి కమిటీలను రద్దు చేయడం ద్వారా, నూతనగా ఎన్నికలను ప్రస్తుతం నిర్వహించడం లేదు కనుక ఎస్ఎంసి చైర్మన్ స్థానంలో ఒక సీనియర్ ఉపాధ్యాయులను నియమించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి విన్నవించడం జరిగిందని వారు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని ఉన్నత అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య , రాష్ట్ర సహా కోశాధికారి భాస్కర్ దేశ్ పాల్గొన్నారు.