జగిత్యాలలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

 

పసుపు వర్ణమైన జగిత్యాల కూడళ్లు

జగిత్యాల ప్రతినిధి, మార్చి 29, (ప్రజా బలం) తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం 41వ ఆవిర్భావ వేడుకలు బుధవారం జగిత్యాల లో ఘనంగా జరిగాయి. టిడిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో టిడిపి జెండాలను అమర్చగా కూడళ్లు అన్ని పసుపు వర్ణంగా మారగా టవర్ సర్కిల్ లో టిడిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహంకాళి రాజన్న మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఘనత టిడిపిదన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పతకం ప్రవేశపెట్టి పేదల కోసం జనతా వస్త్రాలు, పక్కా గృహం పథకాలను అమలు చేశారన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టాడన్నారు. ఇలాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పతకాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశంకు దక్కుతుందన్నారు. ఐటీ రంగాన్ని వృద్ధి చేసిన చంద్రబాబు వేసిన ఆర్థిక పునాది నేటి తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నేడు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని రాజన్న ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగే టిడిపి ప్రతినిధుల సభలో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తామని జగిత్యాల నుంచి సభకు వెళ్తున్నామని రాజన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎల్.శేఖర్, అక్కినపెల్లి కాశినాథం, భార్గవ్ రాం, బాలకృష్ణ, లక్ష్మణ్, విజయ్ కుమార్, బత్తుల కొండయ్య, మల్లయ్య, గంగాదర్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking