అక్రమ కట్టడాన్ని పరిశీలించిన తహసిల్దార్ రమేష్ బాబు.

 

జమ్మికుంట, ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 6

జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం ప్రక్కన ఇటీవల అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారని వచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఆ స్థలాన్ని పరిశీలించిన జమ్మికుంట తహసిల్దార్ రమేష్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మికుంట కొత్తపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ఈ స్థలంలో కొంతమంది అక్రమంగా నిర్మాణం చేపట్టారని మాకు దరఖాస్తు ఇవ్వగా దానిపై విచారణ చేసేందుకు రావడం జరిగిందని ఆయన అన్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్థలం ఖాళీగా ఉందని ఈ మధ్యకాలంలోనే కొందరు వ్యక్తులు ఈ స్థలం నాది అంటూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని దానిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆర్ఐ సర్వేయర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తహసిల్దార్ తెలిపారు. ఎవరైతే కాంపౌండ్ నిర్మించారు వారిని ఆధారాలతో సహా రావాలని తెలిపినట్లు ఆయనే సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking