తమకు న్యాయం చేయాలని ఎమ్మార్వో కు బాధితుల ఫిర్యాదు…

 

జమ్మికుంట, ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 6

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశపూర్ సమీపాన గల సర్వేనెంబర్
640లో 7 ఎకరాల 9 గుంటల భూమి ఉండగా అందులో మూడు ఎకరాల 24 గుంటల నర నెదురు చిన్నయ్య కు చెందినది కాగా మిగతా మూడు ఎకరాల 24 గంటల భూమి నేదురు సారయ్య కు చెందినది. గతంలోనే 640 ఏ సర్వే నెంబర్ లో గల భూమిని
నేదురు చిన్నయ్య అనే వ్యక్తి పలువురికి అమ్మగా వారి వద్ద నుండి మేము కొనుగోలు చేసి వేరే వాళ్లకు విక్రయించే సమయంలో సారయ్య అనే వ్యక్తి ఈ స్థలం నాది అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులు మంగళవారం జమ్మికుంట తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, గతంలో మేము అన్ని రకాల లింకు డాక్యుమెంట్లను పరిశీలించి ఆ స్థలాలను కొనుగోలు చేశామని ఇందులో ఎలాంటి మోసం లేదని అయినప్పటికీ ఒక వ్యక్తి కావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఈ స్థలం నాదే అంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థలంలో నేదురు సారయ్య అనే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని మేము కొనుక్కున్న స్థలం సర్వేనెంబర్ 640 ఏ లోది కాగా సారయ్య ఈ స్థలం 640 బి లో నాది ఉన్నది అంటూ అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఆ స్థలాన్ని అమ్ము కోకుండా చేస్తున్నాడని వారు మీడియాతో వారి ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విషయంపై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేయగా సిఐ వారిని పిలిపించి సర్వేయర్ తో హద్దులు చూసుకోవాలని సూచించారని సర్వేయర్ వచ్చి చూసినప్పటికీ ఈ స్థలం నాదే అంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇప్పటికైనా తహసిల్దార్ స్పందించి ఆ స్థలాన్ని పూర్తిగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన తహసిల్దార్ ఆర్ ఐ సర్వేయర్ను పంపించి విచారణ చేపిస్తానని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఈ సమావేశంలో బాధితులు నూక జగదీశ్వర్ అయిత వేణుగోపాల్ మారుముల రవి మల్లయ్య సిరిసేటి మల్లయ్య బిట్ల అశోక్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking