నూతన మార్కెట్ కార్యదర్శి మల్లేశంకు సహకరిస్తాం

– ఒక్కరోజు మార్కెట్ ఆగకుండా నడిపిన చరిత్ర రెడ్డి నాయక్ ది
– జమ్మికుంట అ డ్తి దారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 6

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బదిలీపై వచ్చిన ఆర్. మల్లేశంకు సంపూర్ణంగా సహకరిస్తామని జమ్మికుంట అడ్తిదారుల సంఘం, దాడ్వాయిల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం భవనంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న గుగులోతు రెడ్యా నాయక్ కు వీడ్కోలు పలుకుతూ.. నూతన కార్యదర్శి మల్లేశంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీగా సమస్తవంతంగా రెడ్డి నాయక్ పని చేశారని తెలిపారు. సుమారు ఆరేండ్ల కాలంలో ఒక్కరోజు కూడా మార్కెట్ ఆగకుండా నడిపిన చరిత్ర అని కొనియాడారు. సుమారు 40 నుంచి 45 మండలాల రైతులు, వ్యాపారస్తులు, అడ్తి దారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకెళ్లిన ఘనత రెడ్డి నాయక్ కు దక్కిందని పేర్కొన్నారు. నూతనంగా బదిలీపై వచ్చిన మల్లేశంకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, ఆయన కూడా చక్కటి సేవలు అందించాలని రాజేశ్వరరావు కోరారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లుల సంఘం మాజీ అధ్యక్షుడు బచ్చు భాస్కర్, జమ్మికుంట రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు జి రాజమౌళి, సీనియర్ నాయకుడు మనోహర్ రావు, జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, ప్రసాద్, ముక్క జితేందర్, ముక్క నారాయణ, బాప్ శెట్టి, ముక్క శ్రీను, వ్యాపారస్తులు, గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking