ఖానాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ పై చర్య తీసుకోవాలని కోరుతూ రెండవ రోజు కొనసాగిన నిరసన*నోరు మూసుకొని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన నాయకులు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..అవినీతి అధికారి నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ సరిత పై చర్యలు తీసుకోవాలని గత రెండు నెలలుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతున్నవి.ఈ సమస్యపై ఐసిడిఎస్ ఇంచార్జి పిడి నిర్మల్ ఐసిడిఎస్ సిడిపిఓ తో తు తూ మంత్రంగా విచారణ జరిపించిన అధికారులు సీడీపీఓపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడానికి వ్యతిరేకిస్తూ వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఒక మహిళ అయి ఉండి మరో మహిళపై అపనిందలు వేయడాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జరుగుతున్న నిరసన కార్యక్రమం నేటికి రెండవ రోజుకు చేరింది.
ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నోరు మూసుకొని నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్.జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి.
గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తోడసం శంభు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులుచెందులహ
సాయికిరణ్ పాల్గొన్నారు