ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : వివిధ కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హల్ లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమీక్ష సమావేశానికి హాజరైన ఎంపి గడ్డం వంశి కృష్ణ,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, వివిధ కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.శనివారంఈ సందర్భంగా ఎంపి గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టడం సంతోషకరం
ప్రతి ఐదు పది సంవత్సరాలకు ఒకసారి జనాభా,కుల గణన చేపట్టాలి, ఆయా సామజిక వర్గాల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమం,అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది,తెలంగాణాలో గత 12 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే చాలామంది నిరుపేదలు సంక్షేమ పథకాలకు దూరం అయ్యారు,కుల ఘనన కార్యక్రమాన్ని
తెలంగాణాలో సక్సెస్ చేస్తే దేశానికి రోల్ మోడల్ గా మారుతుంది.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి,టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు అత్తే సరోజా,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ వివిధ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.