ఖమ్మంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన వన సమారాధన.

కుల మత రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనం

పాత్రికేయుల సమావేశంలో టీజీఇ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడి

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 02 (ప్రజాబలం) ఖమ్మం ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు చేర్చేందుకు నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఉత్సాహాన్ని మరియు ఐక్యతను పెంచేందుకు ఈనెల 3న(ఆదివారం) తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ ఆఫీసర్స్,ఉపాధ్యాయులు,
కార్మికులు, పెన్షనర్స్ మొత్తం 20 వేల మంది ఉద్యోగ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంతో పాటు వనసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు టీజీఇ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి మామిడి తోటలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు.
శుక్రవారం ఖమ్మం నగరంలోని చెరుకూరి వారి మామిడి తోటలో ఉపాధ్యాయ సంఘం ఎస్టీ ఎఫ్ రాష్ట్ర నాయకులు దేవరకొండ సైదులు, నాగిరెడ్డి,
టీజీఓ జిల్లా అధ్యక్షులు కాస్తాల సత్యనారాయణ కార్యదర్శి వేలాద్రి, టి ఎన్ జి ఓస్ నాయకులు గుంటుపల్లి శ్రీనివాస్, కొణిదెన శ్రీనివాస్, జడ్ ఎస్ జయపాల్ ఇతర జె ఏ సి భాగస్వామ్య ఉద్యోగుల సంఘ నాయకులతో కలిసి ఏలూరి మాట్లాడారు ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. 206 సంఘాలతో జేఏసీ ఏవిధంగా ఏర్పడిందో, అదేవిధంగా పూర్వ వైభవం తేవడానికి ఈ ప్రయత్నం అన్నారు. ఉద్యోగులలో మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగుల ఐక్యతను చాటిచెప్పే లక్ష్యoతో
కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామన్నారు. దీనికి జిల్లాకు చెందిన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
లతోపాటుగా జిల్లాకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మెన్లు, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ ను ప్రత్యేక ఆహ్వానీతులుగా ఆహ్వానించామని వివరించారు. అలాగే ఎంపిక చేసిన కొందరికి సన్మాన కార్యక్రమం ఉంటుందని అన్నారు. కుల,మత,రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కు ఉద్యోగుల కుటుంబ సంభ్యులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు వన సమరాధనకు ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే వీలుగా ఖమ్మం నగరంలోని ఆరు సెంటర్ల నుంచి ప్రత్యేకంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఉద్యోగులకు నమ్మకం పెరిగిందన్నారు అపరిష్కృతంగా ఉన్న ఐదు డీఏ లలో,ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఒక్క డీఏ ను మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ ఉద్యోగుల 53 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking