స్వర్గీయ పల్లా జాన్ రాములు 86వ జయంతి సందర్భంగా పెద్దలకు, మహిళలకు, చిన్నారులకు ఉచిత మెగా వైద్య శిబిరం
ఖమ్మం ప్రతినిధి నవంబర్ 02 (ప్రజాబలం) ఖమ్మం పేదల పక్షపాతి, పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ పల్లా జాన్ రాములు 86 వ జయంతి సందర్భంగా వారి కుమారుడు పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో పెద్దలకు, మహిళలకు చిన్నారులకు ఉచిత పరీక్షలు మరియు మందులు ఉచితంగా ఇచ్చారు ప్రతి సంవత్సరం పల్లా జాన్ రాములు జ్ఞాపకార్ధం అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కరోనా సమయంలోనూ మరియు వరదల సమయంలోనూ ప్రజలకు అండగా నిలిచి వారికి నిత్యావసర సరుకులు, త్రాగునీరు, మందులు మరియు బట్టలు పంపిణీ చేసినారు ప్రత్యేకంగా క్యాన్సర్ మరియు తలసేమియా రోగులకు ఉచిత క్యాంపులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే పేద పిల్లలు ఫీజు కట్టలేని స్థితిలో ఉండగా పల్లా కిరణ్ కుమార్ వారికి ఆర్థిక సహాయం చేసి వారికి అండగా నిలబడ్డారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గులగట్టు ఎల్లయ్య(రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్), సుఖభోగి కోటేశ్వర రావు (రిటైర్డ్ లెక్చలర్)చిలకబత్తిని కనకయ్య సి. హెచ్ రాజశేఖర్ రవి కిషోర్ తిరుమలరావు, పల్లా పవన్, దార శ్రావణ్ పల్లా స్పందన అజయ్ తదితరులు పాల్గొన్నారు