తెలంగాణ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

 

-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి కు వినతులు

-నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న ఆధ్వర్యంలో

ఖమ్మం ప్రతినిధి మే 28 (ప్రజాబలం) ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వెంటనే గెజిట్ విడుదల చేయాలని కోరారు నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల ను వారి దృష్టికి తీసుకేళ్ళారు. నాయి భ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు
రానున్న విద్యా సంవత్సరంలో నాయి బ్రాహ్మణ విద్యార్థులకు ఉపాధి రంగాలలో ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు.ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసరావు తదితురులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking