పారిశ్రామికంగా మేడ్చల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉండటం మన అదృష్టం
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సీఎం కేసీఆర్ కృషి
మంత్రి కేటీఆర్ పట్టుదలతో పని చేస్తున్నారు
తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే ముందుకు దూసుకెళ్తోందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి… ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పట్టుదల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మల్టీ నేషనల్, నేషనల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఈ విషయంలో తన నియోజకవర్గమైన మేడ్చల్ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉండటం తన అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నానని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్ తదితరులు ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక వేత్తలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమను ప్రభుత్వం ప్రోత్సహంచి ఎదిగేందుకు కృషి చేసిన తీరును సమావేశంలో వివరించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమాన్ని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని శామీర్పేట మండలం తుర్కపల్లి గ్రామంలోని విష్ణు ల్యాబ్స్ లిమిటెడ్, జినోమ్ వాలీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం ఆవరణలో మొక్కలను నాటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. పారిశ్రామికంగా మేడ్చల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం ఎంతో గర్వకారణంగా, అదృష్టంగా భావిస్తున్నాన ఈ నియోజకవర్గానికి తాను ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు మరింత ఆనందంగా ఉందని మంత్రి మల్లారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వినూత్న కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాలతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఇప్పుడు తెలంగాణ గమ్యస్థానంగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఎవరికీ చెప్పరానన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమత్రి కేసీఆర్ కృషి మంత్రి కేటీఆర్ పట్టుదల వల్ల పారిశ్రామికరంగంతో పాటు అన్ని రంగాల్లో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు ఎన్నో కొత్తగా వస్తున్నాయని గతంలో మాదిరిగా ఎలాంటి పవర్ హాలీడేలు ఇవ్వకుండా ప్రతినిత్యం ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్తును అందిస్తూ ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి వివరించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నామని దీనికి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం కూడా ఎంతో ఉందన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు కొత్తవారిని ప్రోత్సహించడంతో పాటు టీఎస్ ప్రైడ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అన్ని రకాలుగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారిని ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తోందని దీనిని యువకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. అలాగే కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీలో కరోనా తగ్గించేందుకు వ్యాక్సిన్ను మొట్టమొదటిసారి ఇక్కడే కనిపెట్టడం ప్రపంచంలోనే ఎంతో గర్వకారణమని మంత్రి తెలిపారు. కరోనా వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలకు 35 శాతం అందించిన ఘనత దక్కుతుందని అన్నారు. ఇలాంటి పెద్ద పరిశ్రమ తన నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టమని దీనిని గర్వంగా భావిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి సమావేశంలో వివరించారు. పారిశ్రామికరంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో ముందు స్థానంలో ఉందని.. ప్రస్తుతం నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ తమ పరిశ్రమలు నెలకొల్పేందుకు వరుస కడుతున్నాయని ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికరంగంలో సాధించిన ప్రగతికి నిదర్శనంగా నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ బీ పాస్, టీఎస్ ఐ పాస్ వల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఎస్– ఐపాస్ పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. దీని ద్వారా రాష్ట్రానికి తరలివచ్చిన పెట్టుబడుల వెల్లువకు అందుకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ, ఉపాధి తదితర వివరాలను తెలియజేశారు. టీ– హబ్, వీ– హబ్లలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశం నిర్వహించడంతో పాటు ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ దేశంలోని ఇతర రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే నెంబర్– 1 స్థానంలో నిలిచిన తీరును కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు అభిషేక్ అగస్త్య, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీలు అనిత, శైలజ,కో అప్షన్ సభ్యులు,స్థానిక నాయకులు, పరిశ్రమల ప్రతినిధులు, జోనల్ మేనేజర్ మాధవి ,డిప్యూటీ డైరెక్టర్ ,వెంకటేశ్వరలు,ఎడి , ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, జినోమ్ వాలీ పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.