హైదరాబాద్ జూన్ 5 :, అండమాన్, ఎప్పుడో 35ఏళ్ల క్రితం1988 లో డిగ్రీ పూర్తయిన తరువాత విడిపోయిన పాత మిత్రులు అండమాన్ లో అనుకోకుండా కలుసుకోవడంతో వారి ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. వివరలలోకి వెళితే సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ఎస్వి కాలేజీలో 1985-1988 లో చదివిన ఇద్దరు మిత్రులలో ఉప్పు సత్యనారాయణ కళాశాల అధ్యక్షులుగా 1987-88 గెలుపొంది డిగ్రీ పూర్తి చేసుకున్న అనంతరం పాత్రికేయ వృత్తిలో స్థిరపడగా, వ్యాపార పని నిమిత్తం1998 లో అండమాన్ వచ్చిన జి.రమేష్ అనుకోని పరిస్థితిలలో అక్కడే ఉండి స్థిరాస్తి వ్యాపారంలో స్థిరపడి రాణిస్తున్నారు. అంతేకాకుండా హ్యాపీ నివాస్ సంస్థను అండమాన్ కేంద్రంగా స్థాపించి దేశ వ్యాప్తంగా వ్యాపారం చేస్తూ ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాయించుకున్నారు. ఇక అసలు విషయనికోస్తే ఈ నెల మొదటి తేదీన సన్నిహితుల ఆహ్వానం మేరకు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పు సత్యనారాయణ అండమాన్ వెళ్లారు. నాలుగవ తేదీన పుట్టినరోజు కావడంతో ఈ విషయం తెల్సిన ఉప్పు సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఆయన సన్నిహితులు అండమాన్ లో ఆత్మీయ అభిమానంతో నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా శ్రేయోభిలాషుల మధ్య ప్రతి సంవత్సరం జరిగే సత్యనారాయణ పుట్టినరోజును ఈ సారి అండమాన్ లో జరగడం, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పూర్వ విద్యార్థి ఎస్వి కాలేజీ కల్చరల్ సెక్రటరీగా పని చేసిన నకరికంటి రమేష్, ఉప్పు సత్యనారాయణ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియ జేసి జి.రమేష్ అండమాన్ లో ఉంటున్న సమాచారాన్ని తెలపడం, మొబైల్ నెంబర్ ను ఇవ్వడం చకా, చకా జరిగిపోయాయి. ఆయన వెంటనే జి.రమేష్ కు కాల్ చేసి తాను అండమాన్ లో ఉన్న విషయాన్ని తెలియజేశారు.ఈ విషయం తెలియగానే సంతోషంతో జి.రమేష్ తన కార్యాలయానికి ఆహ్వానించగా వెళ్లిన సత్యనారాయణ ఒకరికొకరు ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ సందర్బంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.కొసమెరుపు ఏమిటంటే జూన్ నెలలో విడి పోయిన పాత మిత్రులు 35 సంవత్సరాల తరువాత ఎక్కడో బంగాళా ఖాతం సముద్రం మధ్యలో ఉన్న అండమాన్ లో మళ్ళీ జూన్ నెలలోనే కలవడం యాదృచ్చికమే మరి. ఈ విషయం తెలిసిన పూర్వ విద్యార్థుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.