చెట్లే జీవకోటికి ‘సంజీవని’

ఇంటింటికి మొక్కలను పంపిణీ చేసిన ప్రొఫెసర్ లిల్లీ మేరి
కూకట్ పల్లి జూన్ 6; మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని నిరంతరం రక్షిస్తూనే ఉంటాయని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లిల్లీ మేరి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కూకట్ పల్లి యందు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లిల్లీ మేరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలో ప్రతి జీవి ప్రాణవాయువు పీల్చుకొని జీవనం సాగిస్తున్నారంటే చెట్లు ఆక్సిజన్ వదిలి జీవన మనుగడకు సంజీవనిలా ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రస్తుతము ప్రపంచంలో విడుదల అవుతున్న కలుషితమైన వాతావరణాన్ని పరిశుభ్రంగా చేయడంలో చెట్లు ప్రత్యేక భూమికను పోషించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రజలకు అవసరమైన ప్రాణవాయువు కరువైందని అందువలన ఎన్నో రకాల వింత రోగాలు వస్తున్నాయన్నారు. స్వచ్ఛమైన గాలిని పిల్చేందుకు ప్రతి ఒక్కరూ ఇలాంటి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటే అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. చెట్లు అధికంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన వాతావరణం లభించి స్వచ్ఛమైన గాలి దొరుకుతుందన్నారు. అధికంగా చెట్లు ఉంటేనే సకాలంలో వర్షాలు కురిసి పంటలు కూడా బాగా పండటం జరుగుతుందన్నారు . చెట్టు లేకపోతే ప్రజలకే కాకుండా ప్రతి ప్రాణికి ఇబ్బందులు కలుగుతాయి. మొక్కలు నాటడమే కాదు, వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటేనే మొక్కలు పెరిగి చెట్లు అవుతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking