బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల సుదాకర్
హైదరాబాద్ జూన్ 6 : ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల సుదాకర్ అన్ని రాజకేయ పార్టీలను డిమాండ్ చేసారు. మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాజ్యాధికారం ద్వారానే ప్రతి ఒక్కరికి ఉచిత విధ్యా లభిస్తుంది. చదువుకున్న వారికి ఉద్యోగం లభిస్తుందన్నారు.తద్వారా ఈ వర్గాలకు సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. లేకపోతే దోపిడి వర్గాల రాజ్యంలో బలహీన వర్గాలు ఎలా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. 75 సంవత్సరాల తర్వాత కూడా BC/SC/ST లు సబ్సిడీ బియ్యం కోసం పెన్షన్ల కోసం వేచి చూడవలసి వస్తుంది. పేద కులాలకు రాజ్యాధికారం వచ్చిన రోజు ఈ కష్టాలు ఉండవన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత అన్ని దేశాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు. పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభా ప్రసాదం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభలలో 50 శాతం సీట్లు అదనంగా పెంచి అత్యంత వెనుకబడిన కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ఈ సీట్లు ఇవ్వాలి. విదేశీయులైన ఆంగ్లో-ఇండియన్లుకు నామినేటెడ్ యం.యల్.ఏ లూగా, యం.పి.లుగా ఇస్తున్నారు. కాని ఈ దేశంలో పుట్టిన అత్యంత వెనుకబడిన కులాలకు ఇవ్వడం లేదు. అందుకే అత్యంత వెనుకబడిన కులాలకు ఇంతవరకు అసెంబ్లీకి పార్లమెంటు కడప తొక్కని కులాలకు ఆంగ్లో –ఇండియన్ల మాదిరిగా నామినేటెడ్ యం.యల్.ఏ / యం.పి లు ఇవ్వాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు.బి.సి.ల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్‌ను తొలగించాలని, బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ఎస్సీ /ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి. యాక్ట్ను తీసుకురావాలని, ప్రపంచీకరణ సరళీకృత, ఆర్థిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ /బి.సి.లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బి.సి.లకు రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బి.సి.లకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.కేంధ్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల లో బి.సి. కులాల వాది లెక్కలు సేకరించాలని కోరారు.
Next Post