ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన రైతు రుణ మాఫీ వెంటనే చేయాలి

 

టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు

 

ఖమ్మం ప్రతినిధి జూన్ 5 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం నాచేపల్లి గ్రామంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం లో పాల్గొన్న టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో సందర్భంగా రైతులకు రుణ మాఫీ చేయాలని, వేలాది మంది రైతులు పోస్ట్ కార్డ్ ద్వారా కెసీఆర్ కు ఉత్తరాలు రాయడం జరుగుతుందని, మేనిఫెస్టో లో లేని రైతుబందు ఇస్తున్నాము అని రైతులను ఉద్దేశించి అనడం సమంజసం కాదు, ఏపార్టీ ఐనా మేనిఫెస్టో లో ప్రకటించినవి చేసి అదనంగా చేస్తే సంతోషిస్తారు,కాని రైతు రుణ మాఫీ చేయకుండా,రైతు బందు ఇస్తున్నాము అని ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు అనడం కరెక్ట్ కాదు,గత 5 సంవత్సరాల క్రితం బ్యాంకులో రైతులు తెచ్చిన అప్పులు పెండింగు వలన అదనపు భారం పడి తెచ్చిన అప్పు రెండింతలు అవుతుంది, ఉపేందర్ రెడ్డి రైతులను కించపరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదు,రైతులు తెచ్చిన అప్పు బ్యాంకు ఖాతాలు చూస్తే మంచిది అని గుర్తు చేస్తున్నాను, రైతులు పండించిన వరి ధాన్యం డబ్బులు నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడం వలన రైతులలో గందరగోళ పరిస్థితి నెలకొంది, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2,00,000 రూ రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు,యస్.సి సెల్ నాయకులు సూరేపల్లి రవి,రాయబారపు సంజీవరావు, జడ కోటేశ్వరరావు,జడ రమేష్ చిలకల లింగయ్య,ధనవత్ సైదులు,జడ వెంకటేష్, సప్పిడి వీరబాబు,జడ వినయ్, వాకదని లింగయ్య, తిరపయ్య, పాపారావు,మారయ్య నాగేశ్వరరావు,యువజన కాంగ్రెస్ నాయకులు యాతాకుల శ్రీనాధ్, గుగులోతు మోహన్,ధనవత్ సంతోష్,కర్రి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking