జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి 2 సెప్టెంబర్ 2024 :
స్థానిక హవెలి ఘనపూర్ మండలంలోని మూతాయీ కోట, లింసాంపల్లి లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వర్షంతో కొట్టుకుపోయిన రోడ్లను, తెగిపోయిన చెరువులను ,చెరువుకు పడిన బుంగలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తాండాలకు వెళ్లే రహదారులు భారీ వర్షాన్ని కొట్టుకపోవడం వల్ల ప్రజల రవాణా వ్యవస్థ దెబ్బ తినకుండా, చెరువుకు పడిన బుంగలను కూడా తాత్కాలిక మరమ్మత్తులు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హవేలీ కనపర్తి తహసిల్దార్ నవీన్, మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఇరిగేషన్ అధికారులు సిబ్బంది తరులు పాల్గొన్నారు
