జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో టీజి.ఎస్.డబ్ల్యూ.ఆర్. ఎస్ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి యువజనో త్సవాలకు ఎంపికైన విద్యార్థులు

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 9 :

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాల విద్యార్థులు పాల్గొని పలు బహుమతులు కైవసం చేసుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ రాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జానపదం గ్రూప్ సాంగ్ విభాగంలో మౌనిక బృందం ప్రధమ బహుమతి, జానపదం గ్రూప్ డాన్స్ విభాగంలో ఎన్. విష్ణుప్రియ బృందం ప్రథమ బహుమతి, కవితల విభాగంలో శ్రీవల్లి ప్రథమ బహుమతి సాధించారని తెలిపారు. ప్రథమ బహుమతులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని వీరంతా త్వరలో హైదారాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను గైడ్ చేసిన మ్యూజిక్ టీచర్ ఉప్పులేటి శోభారాణిని ఆమె అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking