27th February 2023
భారత ప్రభుత్వం సహకారంతో భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్ర సంఘటన తెలంగాణ ఆధ్వర్యంలో 14వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం 2023 21st నుండి 27th ఫిబ్రవరి నుండి వాళ్ళంతరిలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా సహకార శిక్షణా సంస్థ, రాజేంద్రనగర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ వి రమేష్ డిజి వాలంటరీ, శ్రీ హెచ్ ఎస్ కే తంగిరాల, శ్రీ ధర్మం ప్రకాష్ జిటి కమాండెడ్ సిఆర్పిఎఫ్ , శ్రీమతి ఏ ఆర్ విజయరావు రాష్ట్ర డైరెక్టర్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, గంటా రాజేష్ సహాయ దర్శకుడు, ,ఖుష్బు గుప్తా, యేసయ్య , రాంబాబు , కోటా నాయక్ జిల్లా యువజన అధికారులు,యాదగిరి పాల్గొన్నారు.
కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ నేను గిరిజన యువతి యువకులను కలవడం ఆనందంగా ఉంది. నేను ఐదు గిరిజన గ్రామాలని దత్తకు త తీసుకోవడం జరిగింది గిరిజన గిరిజనులకు భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను మరియు కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు ప్రతి యువతి యువకులు ఆటంకాలని ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు. వాటిని ఆత్మస్థైర్యంతో ఎదురుకోవాలని కోరారు .మనోబలం దృఢంగా ఉంటే మనల్ని ఎవరు ఏమి చేయలేరు అని చెప్పారు. నల్లమల అడవిలో గిరిజనులకు వైద్యసాయం మరియు ఇతర సహకారాలు కూడా కూడా సరిగ్గా అందడం లేదు కూడా అక్కడ ఏమైనా దుర్మర ప్రతి పరిస్థితిని చూసి అటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు.