అభ్యసన సామర్ధ్యలను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కనీస అభ్యసన సామర్ధ్యలను సోమవారం విద్యాశాఖ అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు హన్మాండ్లు, జనార్దన్, సంతోష్ లు స్థానిక ఎంపిపిఎస్ బోయవాడ, బస్ స్టాండ్ పాఠశాలల్లో ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ న్యూమారసీ కి సంబంధించిన అభ్యసన పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. అనంతరం జడ్పీ బాలికల పాఠశాలలో పదవ తరగతిలో విద్యార్థులు 10 జీపీఏ సాధించేందుకు ఎలా చదవాలో అవగాహనా కల్పించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు బోధనకు సంబంధించిన పలు సలహాలు,సూచనలు చేశారు.ఈ సమావేశంలో మండల విద్యాధికారి కాసుల రవీందర్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking