వృద్దాప్య భద్రతే కాంగ్రెస్ లక్ష్యం

పాత పెన్షన్ పునరుద్ధరణకై కాంగ్రెస్ కట్టుబడి ఉంది

టి.ఎస్.సి.పి.ఎస్.ఈ. యూ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, జనవరి 1: ముప్పైకి పైగా సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు నిర్వహిచిన ఉద్యోగి విరమణ అనంతరం వృద్దాప్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని అందులో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇందిరా భవన్లో తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జీవిత కాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం వృధ్యాప్య భద్రత అవసరమన్నారు. ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకొని తప్పనిసరిగా పెన్షన్ అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఆ దిశగా కట్టుబడి ఉందన్నారు. అందులో బాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిందని జీవన్ రెడ్డి గురుచేశారు. కార్పొరేట్ సంస్థల మేలుకోసమే సీపీఎస్ విధానం వచ్చిందని ఉద్యోగుల మేలుకోసం కాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా పాత పెన్షన్ పునరుద్ధరణ తొందరలోనే చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. సీపీఎస్ తో 19 ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న రెండు లక్షల ఉద్యోగులకు కొత్త సంవత్సర కానుకగా పాత పెన్షన్ పునరుద్దరణకు కృషిచేస్తానని చెప్పిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్, జిల్లా కోశాధికారి గొల్లపల్లి మహేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్, సందుపట్ల రమేష్, బండారి సతీష్, కొణతం నగేష్, కేశెట్టి నవీన్, అనుమాండ్ల నరేందర్, నాంపల్లి హరికృష్ణ, కొత్త వంశీ, గుండా శ్రావణ్,భక్తుల రమేష్, సిర్ర శ్రీనివాస్, ఏగ్యారపు వెంకటేష్, మహేందర్ అపెక్స్ హాస్పిటల్ యాజమాన్యం రమేష్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking