రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 31 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకు తన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో , సాయంత్రం 04.00 గంటల నుంచి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking