అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి

 

ఉప్పొంగిన ఉత్సాహాంతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం

రైతులు సుభిక్షంగా ఉండాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఎంపీ నామ నాగేశ్వరరావు న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్‌ 31 (ప్రజాబలం) ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలను అత్యంత ఉత్సాహా పూరితంగా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి సంతోషంగా ఆనందోత్స హాలతో సంబరంగా జరుపు కోవాలని అన్నారు. ఎన్నో తీపి చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2023 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు చెప్పి , కోటి ఆశలు, ఆకాంక్షలతో 2024 నూతన సంవత్సరానికి ఉప్పొంగిన ఉత్సాహంతో ఘన స్వాగతం పలుకుదామని పేర్కొన్నారు. విభిన్న అనుభవాలు, అనుభూతులను మిగిల్చి ఇక వెళ్ళొస్తానంటూ సెలవు తీసుకున్న 2023కు ఘనంగా వీడ్కోలు చెబుదామన్నారు. కొత్త సంవత్సరంలో అందరూ శాంతి, ఆరోగ్యం, సిరిసంపదలతో శోభిల్లాలని , అనుకున్న లక్ష్యాలను సాధించి, పంటలు బాగా పండి, రైతులు సుభిక్షంగా ఉండాలని ఎంపీ నామ అకాంక్షించారు. కొత్త ఆశలతో అంతకుమించిన లక్ష్యాలతో 2024కు కలర్‌ ఫుల్‌గా ఆహ్వానం పలుకుతూ జీవితంలో విజయం వైపు అడుగులు వేద్దామని అన్నారు. కొత్త సంవత్సరం మరింత ఆనందంగా ఉండాలని, అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఎంపీ నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking