కొత్త ఏడాదిలో అర్హులందరికీ ఆరు గ్యారంటీలు
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 31 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణలోని ప్రతి మహిళా మహాలక్ష్మి గా ఉండాలని రైతన్నలందరికీ భరోసా ఇవ్వాలని గృహాలన్నీ ‘జ్యోతి’తో వెలగాలని ప్రతీ కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని అంతర్జాతీయస్థాయిలో విద్యారంగం వికసించాలని ఆరోగ్య ధీమా దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరికీ ‘చే’యూతనివ్వాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు నయా జోష్ తో అర్హుల దరిచేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులెవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పథకాలన్నీ వారి చెంతకే చేరేలా పారదర్శక పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన ఏడాదిలో ప్రతీఒక్కరి మోములో చిరునవ్వు చూడాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు.