ఐడిఓసి అధికారులు, సిబ్బంది హాజరును జిల్లా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 28 (ప్రజాబలం) ఖమ్మం సోమవారం కలెక్టర్ ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సిబ్బంది హాజరుజీవో 58 అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐడిఓసి అధికారులు, సిబ్బందికి ఆధార్ ఎనబుల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టంను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నట్లు తెలిపారు. విధులకు హాజరు అయిన వారు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం లో తమ హాజరును నమోదుచేసుకొనేలా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. శాఖల వారిగా హాజరును కలెక్టర్ సమీక్షించి, అధికారులను సిస్టం లో హాజరు మెరుగు పర్చుకొనేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జీవో 58 లో నమోదయిన దరఖాస్తుల పరిశీలన ఈ వారంలోగా పూర్తిచేయాలన్నారు. అవసరమైన చోట అదనపు టీముల ఏర్పాటుచేసి, ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకున్న వారి రిజిస్ట్రేషన్లు స్లాట్ ప్రకారం పూర్తి చేయాలని, పెండింగ్ లేకుండా తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీఓ విద్యాచందన, ఖమ్మం ఆర్డీవో గణేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking