ప్రజా వినతుల పరిష్కారాణికి ప్రాధాన్యతన్చి సత్వర పరిష్కార మార్గం చూపాలి జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 28 (ప్రజాబలం)ఖమ్మం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ‘‘గ్రీవెన్స్ డే’’లో ప్రజలనుండి పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు సత్వర చర్య నిమిత్తం బదలాయించారు. బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంకు చెందిన కె.బ్రమరాంబ తన భర్త రామాచారి వృద్దాప్య పింఛను పొందుతూ 2021 సంవత్సరంలో మరణించారని అప్పటి నుండి నాకు వృద్దాప్య లేదా వితంతు పింఛను కొరకు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసు కోవడానికి వెల్లగా రిజక్ట్ అవుతుందని, తనకు పింఛను మంజూరు చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంకు చెందిన బేతుమల్ల రాములమ్మ భర్త నర్సయ్య (లేటు) తనకు వితంతు లేదా వృద్దాప్య పింఛను మంజూరు చేయగలరని సమర్పించిన దరఖస్తులను, పరిశీలించి తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంకు చెందిన షేక్ నజీర్ తాను బస్ పాస్‌కోసం ఆర్‌టిసి బస్సుస్టాండ్ నందు దరఖాస్తు చేసుకున్పటికి అధికారులు అట్టి దరఖాస్తును తిరస్కరించు చున్నారని తనకు బస్‌పాసు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యనిమిత్తం ఆర్‌టిసి రీజినల్ మేనేజర్‌ను ఆదేశించారు.ఏన్కూరు మండలంకు చెందిన పొన్నెబోయిన రాములు ఉమ్మింనేని కృష్ణయ్య తమకు మేడిపల్లి సర్వేనెం.24/ఇలో 6`32 కుంటల భూమి కలదని అట్టి భూమికి సంబంధించి తమ పక్కన సీలింగ్ పొలము సర్వే నెం.25లో గల దుగ్గిరాల గోపులు తండ్రి వెంకయ్య తమ పొలము 24/ఇలో ఉందని ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అట్టి భూమిని సర్వేచేయించి మాభూమికి, అతని భూమికి హద్దులు నిర్ణయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తహశీల్దారును ఆదేశించారు. చింతకాని మండలం నేరడ గ్రామంకు చెందిన టి.లోకేష్ తండ్రి సీతారాములు (లేటు) తనకు కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామ రెవెన్యూ సర్వేనెం.128/ఈ/ఆ నందు 0.35 కుంటల భూమి తాత, తండ్రి నుండి వారసత్వముగా వచ్చినదని అట్టి భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకము ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం కొనిజర్ల తహశీల్దారు ఆదేశించారు. రఘునాథపాలెం మండలం వి.విపాలెం గ్రామంకు చెందిన నల్లగట్ల శ్రీనివాస్ తాను దళిత కుటుంబంనకు చెందినవాడనని, తాను 15 సంవత్సరముల నుండి ఫోటోగ్రఫీ వృత్తిపై అనుభవం కలిగి ఉన్నానని తనకు దళితబందు పథకం క్రింద అవకాశం కల్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎస్సీ కార్పోరేషన్‌ను ఆదేశించారు. రఘునాథపాలెం మండలం గణేశ్వరంకు చెందిన జి.సతీష్‌బాబు తాను ఫారెస్టు అటవీ హక్కుల పట్టా మంజూరు విషయమై తాను దరఖాస్తు చేసుకోవడం జరిగినదని దానికి పాసుపుస్తకము ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం కలెక్టరేట్ ఓ.ఎస్.ఇని ఆదేశించారు.
అదనపు కలెక్టరు డి.మధుసూదన్‌నాయక్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్, రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా అధికారులు తదితరులు గ్రీవెన్స్‌డేలో పాల్గొన్నారు.