గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు నంది పురస్కార అవార్డ్ గ్రహీత, ఉత్తమ నేపధ్య గాయకుడు, ఒక విప్లవ కవి, ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతి రేకించిన “గదర్ పార్టీ” కు గుర్తుగా తీసుకోవడం జరిగింది. గద్దర్ మరణం తెలంగాణా ప్రజా గాయకులకు, సాంస్కృతిక కళా కారులకు తీరని లోటని, సినిమా పరిశ్రమ వారీ ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ అద్యక్షుడు వల్లభనేని అనీల్ కుమార్ నేతృత్వంలో జరిగిన సంస్మరణ సభలో చైర్మన్ రసమయి బాలకిషన్ గద్దర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళి అర్పించారు, ఈ కార్య క్రమంలో గద్దర్ వారసుడు సూరీడు, సినీ కళమతల్లి రంగ పెద్దలూ, ప్రముఖులు కళా కారులు, అభిమానులు సంస్మరణ సభలో పాల్గొని గద్దరకు మనస్సార స్మరించి శ్రద్ధాంజలి ఘటించారు.