ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెడింగ్లో ఉండకుండా అధికారులు వెంటనే పరిష్కరించాలి

 

ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 20: ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్నందున వారు అందచేసిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు ఏమాత్రం పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ కార్యాయలంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, వినతులు, విజ్ఞప్తులను అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డిలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో మొత్తం 47 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయా దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి సంబంధిత శాఖల అధికారులకు తెలియజేస్తూ వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో అవసరమైతే సంబంధిత సమస్యను ఆర్జీ సమర్పించిన వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking