ప్రధాన ఉపాధ్యాయుడుని వెంటనే సస్పెండ్ చేయాలి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20 మంచిర్యాల లోని కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు పెద్దల సత్యం మాట్లాడుతూ….కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని పాఠశాల నందు విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విధంగా రాజకీయ నినాదాలు చేయడం జరిగింది ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండి ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. మీకు రాజకీయంపరంగా ప్రజలకు సేవ చేద్దామని ఉంటే మీరు వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మీరు రాజకీయాలకు రావాల్సిందిగా కోరడమైనది మీరు రాజకీయ నాయకులకు భజనలు చేయడం తప్ప మీ పాఠశాలకు అవసరమైన సామాగ్రిని గాని విద్యార్థులకు బుక్స్ గాని ఆటవస్తులుగాని ఎమ్మెల్యే కి చెప్పి తెప్పించుకునే అంత సత్తా మీకు లేదు.కానీ మీ పబ్బం గడపడం కోసం మీరు రాజకీయ నాయకులకు జేజేలు కొట్టడం రాజకీయ నాయకులకు భజన చేయడం సిగ్గుచేటు అని అన్నారు.వెంటనే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుని మీద శాఖా పరమైన చర్యలు తీసుకొని అతని విధులను సస్పెండ్ చేయాలని బిజెపి పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ అధ్యక్షుడు సుద్దపల్లి సుశీల్ కుమార్,చెన్నూరు పట్టణ ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్,పట్టణ ఉపాధ్యక్షులు కొంపెల్లి బానేష్, పెండ్యాల శ్రీకాంత్, బీజేవైఎం నాయకులు శివకృష్ణ తమ్మ సంజయ్,కొరుకొప్పుల వంశీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking