ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జ్ అయితే గాని శ్రీనివాస్ గౌడ్
ఖమ్మం ప్రతినిధి జులై 12 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా రెవిన్యూ వ్యవస్థ తో కలిసి పంచాయతి కార్మికులు వంటావార్పు ,మిలియన్ మార్చ్,దీక్షా దివాస్ మరియు సకలజనుల సమ్మె తోపాటు జెఏసి పిలుపుమేరకు అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని చివరికి స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత స్వరాష్ట్ర పాలనలో కూడా ఏ కార్మికుడికి న్యాయం జరగలేదన్నారు పంచాయతీ కార్మికుల డిమాండ్లు తీరేంతవరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు బహుజన సమాజ్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు కార్మికులకు కనీస వేతనం కల్పించాలని అలాగే హెల్త్ పరంగా కూడా వారికి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు కార్యక్రమంలో బహుజన జిల్లా నాయకులు చేకూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు