ఖమ్మం ప్రతినిధి జులై 12 (ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఖమ్మం మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మానుకొండ రాధాకిశోర్ చిన్నకుమారుడు మానుకొండ శ్రీధర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందగా వారి కుటుంబాన్ని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు మృతుని ఫొటోకు పూలు వేసి నివాళ్లర్పించారు చిన్న వయస్సులోనే గుండెపోటు రావడం బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ పర్యటనలో తుమ్మల వెంట జిల్లా నాయకులు సాదు రమేష్ రెడ్డి జొన్నలగడ్డ రవి తాత రఘురాం మరియు పాలేరు మరియు ఖమ్మం నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు