ఎంజేపి పాఠశాలను సందర్శించిన డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మరియు నిర్మల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ అర్జుమన్అలీ
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ఎంజేపీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అయాన్(14) అనే విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు, గ్రంధాలయ చైర్మన్ అర్జుమన్ అలీ పాఠశాలకు వెళ్లి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ మరియు మహాత్మ జ్యోతిబాపులే స్కూల్ జాయింట్ సెక్రటరీ తిరుపతి బాద్యులను తక్షణమే సస్పెండ్ చేశారు.కుటుంబానికి ప్రభుత్వం తరపున 2లక్షలు ఎక్సిగ్రేషియా,కుటుంబం లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం,గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు.విద్యార్థులకు ధైర్యంగా ఉండాలని అన్ని విషయాలకు అందుబాటులో అండగా ఉంటాం అని వారిలో ఆత్మస్థైర్యం నింపారు.వీరి వెంట నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను ,దేవరకోట దేవస్థానం చైర్మన్ కొండ శ్రీనివాస్ నాయకులు కొంతం గణేష్,డా.ఈసవేని మనోజ్ యాదవ్,గడ్డం నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు