రైల్వే పెన్షనర్స్ కొరకు సేవ కేంద్రం ఏర్పాటు

 

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి నవంబర్ 5

ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట శాఖ యందు రైల్వే పెన్షనర్స్ కొరకు లైఫ్ సర్టిఫికెట్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట శాఖ అధ్యక్షులు దాసరి రాజేశ్వర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం 3.0 ప్రెస్ “అదేంటికేషన్ టెక్నాలజీ ప్రమోషన్” లో భాగంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలోని పెన్షనర్స్ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికెట్ నమోదు కార్యక్రమం సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్క రైల్వే విశ్రాంత ఉద్యోగి కి తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకులోకి వెళ్లి ఇబ్బందులు పడకుండా నేరుగా కార్యాలయానికి వస్తే వేలిముద్రలు స్వీకరించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ నమోదు చేస్తామని, ఒకవేళ ముఖం సరిగా రాక వేలిముద్రలు పడని వారికి మాన్యువల్ గా రాసి బ్యాంకులకు పంపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా 96 సంవత్సరాల వయసు గల మాణిక్యాలరావు కు, 83 సంవత్సరాలు గల విద్యాసాగర్ కు లైఫ్ సర్టిఫికెట్ నమోదు చేశామని తెలిపారు.నవంబర్ 30 లోపు ప్రతి ఒక్క రిటైర్డ్ రైల్వే ఉద్యోగి లైఫ్ సర్టిఫికెట్ బ్యాంకులలో సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట బ్రాంచ్ అధ్యక్షులు దాసరి రాజేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ టి వెంకటస్వామి, సెక్రటరీ మొయినుద్దీన్, మల్లేశం, ట్రెజరర్ విద్యాసాగర్, జాయింట్ ట్రెజరర్ ఖాదర్ ఖాన్, పరశురాములు పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking