నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

పాపన్నపేట ట్రాన్స్కో ఏఈ నర్సింలు

ప్రజాబలం, పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగిలో ఉన్న 33 కేవీ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా మండల పరిధిలోని గాజులగూడెం, కొడపాక, అచ్చనపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ట్రాన్స్కో ఏఈ నర్సింలు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇట్టి విషయంలో విద్యుత్తు వినియోగదారులు తమకు సహకరించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking