స్పీకర్‌ను బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు కొట్టేంత పనిచేశారు

ఎంఎల్‌ఎ వేముల వీరేశం
హైదరాబాద్‌ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌ డిసెంబర్‌ 20 శాసనసభలో ఈ రోజు చీకటి రోజు అని కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ వేముల వీరేశం తెలిపారు. దళిత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ను అవహేళన చేస్తూ పేపర్లు విసరడం సరికాదని మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి అగ్రకుల అహంకారం చూపించారని ధ్వమజెత్తారు. అసంబ్లీ ఆవరణలో విూడియా పాయింట్‌ వద్ద వేముల వీరేశం ప్రసంగించారు. స్పీకర్‌ను బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు కొట్టేంత పనిచేశారని దుయ్యబట్టారు. ప్లకార్డులు తీసుకురావొద్దు, నినాదాలు చేయొద్దని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఈ నిబంధనలతోనే సంపత్‌, కోమటిరెడ్డిలను శాసనసభ నుంచి బయటకు పంపిచారన్నారు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ కౌశిక్‌రెడ్డి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదని వేముల వీరేశం ప్రశ్నించారు. శాసన సభలో ఫార్ములా ఈ రేస్‌ అంశంపై చర్చ జరగాలని బిఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టడంతోనే హెటెన్షన్‌ నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking