అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికహారం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

శుక్రవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి రోజు చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికహారం అందించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మౌలిక వసతులను మెరుగుపర్చాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా,పిల్లలకు సురక్షితమైన, శుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు.పిల్లల ఆరోగ్యం,పోషణ, విద్య పరంగా అవగాహన పెంచలన్నారు.కేంద్రాల పనితీరు మెరుగుపడి, పిల్లల,గర్భిణీ స్త్రీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాలలో న్యూట్రి గార్డెన్స్ లను ఏర్పాటు చేసి పెంచిన ఆకు కూరలు, కూరగాయలను ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించాలన్నారు ప్రతి రోజు కోడిగుడ్డు, ఇతర పోషక ఆహార పదార్థాలను అందించి రక్తహీనత పిల్లల ఎదుగుదల లోపం వంటి సమస్యలను నియంత్రించాలని సూచించారు. చిన్నారులకు క్రమం తప్పకుండా బాలామృతాన్ని అందించాలని, ఏకరూప దుస్తులను అందజేయాలన్నారు. ప్రతి అంగన్వాడి కేంద్రాల్లో సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.  పర్యవేక్షకులు అంగన్వాడిల నిర్వహణ తీరును పరిశీలించి నివేదికలను పంపాలన్నారు. చిన్నారుల హాజరు శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలని, మండలాల వారిగా అంగన్వాడీల్లో నిర్వహిస్తున్న న్యూట్రి గార్డెన్స్, సామ్, మామ్ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా చిన్నారుల ఎత్తు, బరువు వివరాలను నమోదు చేసి నివేదికలను అందజేయాలన్నారు. అంగన్వాడీల పరిసరాలలో నిరంతరం పరిశుభ్రతను పాటించాలన్నారు.
ఈ సమావేశంలో సిడిపిఓ లు నాగలక్ష్మి, నాగమణి,సరిత, సరోజిని లు, మండలాల అంగన్వాడి పర్యవేక్షకులు, అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking