ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ప్రతినిధి డిసెంబర్ 20 : ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 317 వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 51 కోట్ల 73 లక్షల రూపాయల నగదు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతిపాదించిన 326 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 317 కొనుగోలు కేంద్రాల ద్వారా 41 వేల 307 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో 9 వేల 799 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉందని,సంబంధిత 3 వేయి 436 మంది రైతుల ఖాతాలలో 51 కోట్ల 73 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు.జిల్లాలో 22 రైస్ మిల్లులకు సి.ఎం.ఆర్. అనుమతులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.