టి ఎస్ యు స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బోరే నవీన్ కుమార్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 27 : కేంద్రంలో ఎన్ డి ఎ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యారంగానికి మొండి చెయ్యి చూపెట్టిందని ఖండిస్తూ నిరసన తెలుపుతూ టి ఎస్ యూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బోరే నవీన్ కుమార్ మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట స్థానిక విశ్రాంతి భవనంలో అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత మొత్తం బడ్జెట్ 45,03,638 కోట్ల నుండి,48,21,000 కోట్లు పెరిగింది అంటే 7% బడ్జెట్ పెరిగిందని అనే విద్యా రంగానికి తీవ్రంగా నిధులు తగ్గించేసారని అన్నారు గత ఓటన్ ఎకౌంట్ బడ్జెట్లో విద్య రంగానికి 1,12,899 (2.5)% కోట్లు బడ్జెట్ కేటాయించిన కేంద్రంలో నాడు డిజిటల్ గ్రంధాలయం నిధులు జాతీయ విద్యా మిషన్ నిధులు ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ 157 నర్సింగ్ కళాశాలలు ఐ ఐ టి టీ లను ఈ బడ్జెట్లో ఈ అంశం లో ప్రస్తావించలేదు ఉన్నత విద్యా సంస్థలు కేంద్ర విద్యాలయాలు అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే యు జి సి కి అధికంగా నిధుల కోత పెట్టారు.గత బడ్జెట్లో యు జి సి కి 5,360 కోట్ల నిధులు కేటాయించగా క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నాయి 2023లో యు జి సి కి 6,409 కోట్లు రూపాయలు మాత్రమే కేటాయించారు.గత బడ్జెట్లో14,903,87 కేటాయింపులు చేస్తే ప్రస్తుతం15,923 మాత్రమే చేశారు ఐఐటీ ల గత బడ్జెట్ గత 9661,50 కోట్లు ఈ బడ్జెట్లో10,324,50 కోట్లు మాత్రమే కేటాయించారు.నూతన విధానాలు 2020 దీని ప్రతిపాదన లు దేశంలో అమలు చేయాలంటే (4,82,100)కోట్ల నిధులు అవసరమని అని చెప్పితే ప్రస్తుతం ఒక లక్ష కోట్లు మాత్రమే కేటాయించి దులుపుకున్నారు.దేశ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే జిడిపిలో 6% కేంద్ర బడ్జెట్లో 10% కేటాయించాలని విద్యా వ్యవస్థ రంగాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్న క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తోంది,ఈ బడ్జెట్ ని ఖండిస్తూ బడ్జెట్ సవరణ చేయాలి విద్యా వ్యవస్థకు అభివృద్ధికి సహకరించి కృషి చేయాలని నిధులను కేటాయించాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు స్టూడెంట్ సభ్యులు గెల్లు తిరుపతి, నాగార్జున,బోర తిరుపతి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.