పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవతకవతలపై సమగ్ర విచారణ జరుపాలి
నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఎం ఏ ఖదీర్ డిమాండ్
నల్గొండ మార్చ్ 23 ();చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అందుకు కుల గణన చేపట్టి పార్లమెంట్లో బిసి బిల్లును ప్రవీశ పెట్టి ఆమోదం తెలుపాలని, కేంద్రం లోబిసి లకు ప్రత్యెక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఎం ఏ ఖదీర్ డిమాండ్ చేసారు.ప్రజాస్వామ్యం వ్యవస్తలో 16 రాజకీయాల పార్టీల మద్దతు ఉండి కూడా విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో మరియు రాజకీయ రంగంలో న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేస్తున్న ప్రయత్నంలో అందరూ బీసీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా పార్లమెంటులో కానీ అసెంబ్లీలో గాని బీసీలకు అత్యున్నత స్థానాన్ని కల్పించి బిసి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ని కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. కేంద్రం – రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో ఖాళీగా యున్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిపిన గ్రూప్ 1 సర్వీస్ పరీక్షలలో జరిగిన అవతకవతలు అంశం చాలా సీరియస్ అంశం దీనిపై వాస్తవాలు బయటకు తీసుక వచ్చి రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నా నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.ఇక గ్రూప్ – 1 సర్వీస్ ఉద్యోగులకు నోటిఫికేషన్ గత 2011లో జారీ చేశారు. గత 12 సంవత్సరాల ప్రిపరేషన్ అవుతున్నారు. ఎంతో ముఖ్యమైన పాలన రంగంలో సమర్థవంతమైన అధికార యంత్రాంగమును ఇచ్చే కీలకమైన పోస్టులను పేపర్ లీకేజీ ద్వారా భ్రష్టు పట్టించేందుకు చూస్తున్నారు. ఈ లీకేజ్ వెనుక ఎంత పెద్ద వారి యున్న వదిలి పెట్టరాదని ఎం ఏ ఖదీర్ ముఖ్య మంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేసారు.