రాష్ట్రా ప్రభుత్వాలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలి సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి

 

కరీంనగర్ ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 9

కేరళ రాష్ట్రంలోని సిపిఎం ప్రభుత్వంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నిర్లక్ష్య వైఖరి కి నిరసనగా సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి,
కార్యదర్శివర్గ సభ్యులు గీట్లముకుంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రాష్ట్రాలకు రావలసిన నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందని అన్నారు.
కేరళ రాష్ట్రంలోని సిపిఎం ప్రభుత్వం పై గవర్నర్ ను అడ్డుపెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తుందని అన్నారు. రాష్ట్ర హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూల్చాలని కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కేరళ రాష్ట్రంలో అనేక వరదలు వచ్చి కోట్లాది రూపాయల ఆస్తినష్టం,ప్రాణ నష్టం జరిగిన కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా వివక్షగా వ్యవహరించిందని అన్నారు. దేశంలోనే కరోనాను అరికట్టిన రాష్ట్రంగా పేరోoదిన కేరళ రాష్ట్రన్ని అభినందించవలసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం, అవాకులు చేవాకులు పేలుస్తూ కేరళ రాష్ట్రాన్ని విస్మరిస్తుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అలా వ్యవహరించకుండా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సిబిఐ, ఈడి సంస్థలను వాడుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, రాష్ట్రాలకు రావాల్సిన వాటాను మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని రాజ్యాంగ విలువలను అపహాస్యం చేస్తూ గుండాగిరి చేస్తున్నారని అన్నారు. బిజెపికి దేశంపై ప్రేమ లేదని కేవలం అదాని, అంబానీలపై మాత్రమే ప్రేమ ఉందని అందుకే దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని, ప్రజల కష్టార్జితంతో చెమటటోడ్చి కట్టిన పనులను, అధాని అంబానీలకు దోచిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారచౌకగా అమ్ముతూ కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల స్వాతంత్రపు హక్కును కోల్పోతారని, రానున్న పార్లమెంటు ఎన్నికలలో బిజెపిని బంగాళాఖాతంలో కలపాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం,జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్, నాయకులు జి తిరుపతి, రాయికంటి శ్రీనివాస్,పున్నం రవి, తిప్పారపు సురేష్, కవంపల్లి అజయ్,రాజ్ కుమార్,కండె రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking