అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్. ఆదేశాల మేరకు డిఎస్పీ గంగారెడ్డి, ఆధ్వర్యములో నిర్మల్ గ్రామీణ సిఐ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ ఎస్ఐ చంద్ర మోహన్ తేదీ: 08.02.2024 రోజున కొంత మంది మూడు వాహనములలో నిషేదిత గంజాయిని హైదరాబాద్ వైపు నుండి నిర్మల్ వైపునకు అక్రమంగా రవాణా చేస్తు కొండాపూర్ జంక్షన్ దగ్గర గంజాయిని ఇతరులకు విక్రఇస్తారని నిర్మల్ రూరల్ ఎస్ఐ గారికి సమాచారం రాగా, వెంటనే తన సిబ్బందితో కొండాపూర్ జంక్షన్ దగ్గరికి వెళ్లి మాటు వేసి రెండు స్కోడా కార్ లు మరియు ఒక బులేరో వాహనము లను ఆపి,
అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని విచారించగా వారు తమ వివరములు క్రింది విధముగా తెలిపినారు.
1)మేగావాత్ రాజు, వయస్సు: 29 సంవత్సరములు, నివాసం: వటపల్లి గ్రామము, మెదక్ జిల్లా,
2)షేక్ ఇమ్రాన్ @ అర్మాన్, వయస్సు:41 సం.లు, నివాసం; నయా ఇస్లాం పుర గ్రామము, నాసిక్ జిల్లా,
మహారాష్ట్ర రాష్ట్రం,
3)షేరు శాదిక్ షేక్, వయస్స్సు: 38 సంవత్సరములు, నివాసం: సిడకో కాలని, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం,
4)మహమ్మద్ ఇలియాస్, వయస్సు: 25 సంవత్సరములు, నివాసం: ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా,
5)ప్రఫూర్ కుమార్ ఖిల్లా, వయస్సు: :40 సంవత్గ్సరములు, నివాసం; పిలకుస్మి గ్రామం, ఓడిశా రాష్ట్రం,
6)భావులాల్ దేవ్ చాంద్ జార్డే, వయస్సు:35 సంవత్సరములు, నివాసం: నంది గ్రామం, జాలనా జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం,
7)పందేనా నిఖిల్ వయస్సు:21 సంవత్సరములు, నివాసం; ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా.
అని తెలిపి, తాము గంజాయిని ఒడిష రాష్టం లోని మల్కానిగిరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి దగ్గర దాదాపు వారం కింద తక్కువ ధరకు దాదాపు 50 కిలోల గంజాయిని/కిలోకు రూపాయలు 3,000/- చొప్పున మొత్తం 1,50,000/-రూ. గంజాయి కొని, అట్టి గంజాయిని వారు ఒక ముఠా గా ఏర్పడి అట్టి గంజాయిని వీలుని బట్టి వారి యొక్క రెండు స్కోడా కార్ లు మరియు ఒక బులేరో వాహనములు (దీనిలో అక్రమముగా గంజాయిని తరలించడానికి ఒక స్పెషల్ కంపార్ట్ మెంట్ తయారు చేసినారు) ఇట్టి మూడు వాహనాలలో ట్రాన్స్ పోర్ట్ చేస్తూ హైదరాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్ మరియు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో అవసరమైన వ్యక్తులకు అట్టిగంజాయిని ఎక్కువ ధరకు అనగా ఒక కిలో కు 25,000/చొప్పున అమ్ముకొని లబ్దిపొందుతాము అని తెలిపినారు.వారి వద్ద నుండి
1) 24.8Kgల నిషేదిత గంజాయి, దాని విలువ. 6,20,000/-
2) నగదు 40,000/- రూపాయలు,
3) (10) సెల్ ఫోన్
4) (3) వాహనాలు
స్వాధీన పరుచుకుని, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేసి ఇట్టి పై ఏడుగురు వ్యక్తులను కోర్టు ముందు హాజరు పరచగా మేజిస్ట్రేట్ గారు పై వ్యక్తులను రిమాండు కు పంపనైనది.
ఈ సందర్భంగా గంజాయి విక్రయించే వారిపై నిఘా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా గంజాయి విక్రయించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్., గారు తెలిపినారు.
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకోవడానికి సహకరించిన నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి, నిర్మల్ గ్రామీణ సిఐ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ ఎస్ఐ చంద్ర మోహన్, దిలావర్ పూర్ ఎస్ఐ యాసిత్ ఆరాఫత్ అలీ, సారంగాపూర్ ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి, నర్సాపూర్ (జి) ఎస్ఐ పి.రవీందర్, ఐటి కోర్ ఎస్ఐ రవి కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking