బడిలో ఆకలికి స్పందించిన వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 09 ఫిబ్రవరి 2024:
“బడిలో ఆకలి” శీర్షిక గాంచి వెంటెనే స్పందించిన వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మినుములు, బెబ్బర్లు, అలసందలు, బటానీలు, చేనిగలు, పెసర్లు, సోయా గింజలు, మసూర్ పప్పు, చిక్కుడు గింజలు, ఉలువలు, పల్లీలు ఆదిగా గల 11 రకాల పౌషకాహారాల మిశ్రమ ధాన్యాలతో తయారు గావించిన అల్పాహారాన్ని ట్రస్ట్ సభ్యులైన అందె లక్ష్మణ్ రావు, నరేశ్ సత్యనారాయణ పవర్ల ఆర్థిక సహకారాలతో మణికొండలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న 206 మంది భావి భారత పౌరులైన విద్యార్థిని విద్యార్థులకు సాయంత్ర సమయాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ నాయక్ గారి సమక్షంలో మొదటి విడతగా నాలుగు రోజులు ఇవ్వడానికి ట్రస్ట్ కన్వీనర్ నిర్మల్ చంద్ గొలేచ, కోశాధికారి దిలీప్ కక్కడ్ లు తెలియ పరచడమే కాకుండా రాబోయే సోమవారం రోజున బీ.ఆర్.సి ఎదురుగా గల గోల్డెన్ ఒరియల్ అపార్ట్మెంట్ లోని వయోజన సభ్యులు బ్రెడ్ బటర్ సేవ చేయడానికి ముందుకు రాగా మిగిలిన రోజులలో ఎవరైనా వారి ఇష్ట ప్రకారం త్రోచిన విధమైన అల్పాహారాన్ని సమకూర్చి ముందుకు రావొచ్చని, ఎవ్వరూ లేని రోజులలో వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల అభిప్రాయం సేకరించి వారి సహాయ సహకారాలతో వారికి త్రోచిన విధమైన అల్పాహారాన్ని సమకూర్చి మలి విడతగా రాబోయే మండల రోజులు అనగా మార్చి 15 వరకు ఏ లోటు పాటూ రాకుండా విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి పోషక పదార్థాలతో కూడిన సాయంత్రపు తిను బండారాలను అందించడానికి ప్రయత్నిస్తామని సాధరముగా సవినయంగా తెలియ జేసినారు.

   

 

Leave A Reply

Your email address will not be published.

Breaking