శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి

 

వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 22:శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పకుండా పాటించాలని ఈ విషయంలో జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఓటరు తుది జాబితా, బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ ప్రక్రియల నివేదికలు సకాలంలో పంపించడంపై జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పకప్పుడు స్పందించి సకాలంలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదైన ఉపాధ్యాయుల వివరాలు ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను మరికొన్ని జిల్లాల్లో ఇవ్వాల్సి ఉందని వాటిని ఆయా జిల్లాల వారు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లయితే సంబంధిత బృందాలు తక్షణ చర్యలు తీసుకోవాలని వికాస్రాజ్ ఆదేశించారు. అలాగే బ్యాలెట్ పత్రాలకు సంబంధించి వెరిఫికేషన్ రిపోర్టు పంపించాలని, బ్యాలెట్ బాక్సులను నేరుగా కౌంటింగ్ కేంద్రానికి పంపించే విషయమై వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking