అమరుల సంస్మరణ సభను ఘనంగా నిర్వహించాలి

 

జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి,మౌనం పాటించి.. అమరుల సంస్మరణ తీర్మాణం చేయాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 21: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 22న అమరుల సంస్మరణ సభలను జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సూచించిన విధంగా నిర్వహించాలని ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ఈనెల 22న తెలంగాణ అమరుల సంస్మరణ కార్యక్రమాలను జిల్లాలోని అన్నిగ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉదయం 11 గంటలకు సమావేశంనిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాల్సిందిగా కలెక్టర్ సూచించారు. అనంతరం అమరుల సంస్కరణ తీర్మాణం చేయాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులు ఆదేశించారు. అదే విధంగా జిల్లాలోని అన్నిమున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులలో శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలని తెలిపారు. దీనిని సంబంధిత నిర్ణీత ఫార్మాట్లో అమరుల సంస్కరణ తీర్మాణాలు జాగ్రత్తగా చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులకు ప్రత్యేకంగా సూచించారు.  అలాగే విద్యాలయాల్లో,  ప్రార్ధనా సమావేశంలో అమరుల స్మృతిలో భాగంగా వారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా  జిల్లాలో కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయా నియోజకర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking