జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మార్గం లేదు

 

అన్ని కులాలకు మతాలను గౌరవిస్తూ అభివృద్ది సంక్షేమం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.

దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ బట్టలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి జూన్ 21 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం, గుడ్ షెఫరడ్ చర్చ్, మజీద్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

అనంతరం రోటరీ నగర్ లోని గుడ్ షెఫరడ్ చర్చ్, తుమ్మలగడ్డలోని మజీద్- ఏ-అస్టాబల్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ పాల్గోన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆది నుండి అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నదని, ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ఈ దేశానికి బలం అని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతున్నదన్నారు.

భిన్న మతాల భక్తి, ఆధ్యాత్మక రంగాల వైభవానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ, వేదహిత-వేద పాఠశాల సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని వేద పాఠశాలలకు ఆలంబనగా రూ.2.00 లక్షలు ఆర్ధిక సహాయం అందించే పథకం ద్వారా అందిస్తున్నరన్నారు.

క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోకాపేట్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో క్రిస్టియన్ భవన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నదని, దీంతో పాటు చర్చీలు, గ్రేవ్ యార్డుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరస్తున్నదన్నారు.

చర్చిల నిర్మాణాలకు అనుమతులు సులభతరం, పునరుద్ధరణకు చర్యలు చర్చిల నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసి, తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చిల నిర్మాణానికి కఠిన నిబంధనలుండేవని కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వెసులుబాటు కల్పించిందన్నారు.

.
ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, బుర్రి వెంకట్ కుమార్, దండా జ్యోతి రెడ్డి, దాదే అమృతమ్మ సతీష్, మడురి ప్రసాద్, మక్బూల్, ఆలయ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు(చిన్నా), పాస్టర్ లు ఆర్ ఇ వి.జాన్ కాంతారావు ఆర్ ఇ వి బి.సత్యపాల్ జోజి జిల్లా మైనార్టీ అధికారి మెహమూద్, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఖమర్, షౌకత్ అలీ, మెహబూబ్ అలీ, ముఫ్తీ ఖలీక్, తాజ్ఉద్దీన్ ఎండీ గాయాజ్, షంశుద్దిన్, టిప్పు సుల్తాన్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking