-టిడిపి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ పిబ్రవరి 11:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని టిడిపి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్ చేశారు మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే మహిళలకు 2500 రూపాయలు, 2000 ఉన్న ఆసరా పింఛన్లు 4000. గ్యాస్ సిలిండర్ 300.సబ్సిడీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తామని నమ్మబలికిందని ఆయన పేర్కొన్నారు ఇప్పటికీ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, డిగ్రీ చదువుకున్న యువతకు 4000 నిరుద్యోగ భృతి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తానని ఇవ్వకపోవడం దారుణం అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను పట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నర అయినా గాని వీటిపై ప్రభుత్వానికి ఊసే లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్. జయ, సుకన్య. పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, పారుపల్లి శీను, చోటు, అభిబ్, లక్ష్మణ్, భాగ్యలక్ష్మి, మంజుల, జ్యోతి, అహల్య రాణి, రాజేశ్వరి, పుష్ప, అరుణ, రాజేశ్వరి వరలక్ష్మి, రమ, సుగుణక్కలు పాల్గొన్నారు.