గజ్వేల్ నియోజకవర్గం ఫిబ్రవరి, 11 ప్రాజబలం ప్రతినిధి :-
దేశం లోని విశ్వకర్మలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెద్దపీట వేసి ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహిస్తుందని బిజెపి సోషల్ మీడియా ఇన్చార్జి, ఐటి సెల్ కన్వీనర్ వెంకట చారి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వకర్మ లకు కామారెడ్డి లో గత సోమవారం నుండి ఈ సోమవారం వరకు జరిగిన శిక్షణ తరగతులు విజయవంతం అయినాయని భారతీయ జనతా పార్టీ ఐటి సేల్ కన్వీనర్, సోషల్ మీడియా ఇన్చార్జి వెంకట్ చారి తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ లో నైపుణ్యత తో కూడిన పలు అంశాలపై థిరి క్లాస్ చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ గా అనేక పని ముట్ల తయారి విధానం ను నేర్పించిన శ్రీమతి రుచిత మేడం ను శాలువా తో ఘనంగా సన్మానించి సత్కరించినట్లు వెంకటచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, నిరజ, మహేష్ తదితరులు శిక్షణ ఇచ్చినట్లు వెంకట్ చారి తెలిపారు. ఈ సందర్భంగా వెంకటచారి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే తమ వృత్తిని గౌరవంచి అన్ని విధాల చైతన్య పరుస్తూ ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న విశ్వకర్మ లకు సమాజంలో సముచిత స్థానం కల్పించి ప్రాధాన్యత కల్పించిన ఘనత ప్రధాని నరేంద్రమోడీ కే దక్కుతుందన్నారు.