గృహలక్ష్మి పథకం గడువు పెంచాలి

లక్షెట్టిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 08 : ప్రభుత్వం చేపట్టిన గృహ లక్ష్మి పథకం ధరకాస్తు గడువు పెంచాలని అదే విధంగా అందులోని కొన్ని నిబంధనలను తొలగించాలని లక్షెట్టిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు అన్నారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ…కేవలం మూడు రోజుల గడువు పెట్టి,కుల ధృవీకరణ పత్రాలు,ఆదాయ పత్రాలు కావాలంటే ఎలా అందుతాయి అని అన్నారు. అలాగే ఇంటి స్థలాలు నూటికి 80 శాతం మంది కి పట్టాలు లేవని అన్నారు. నిరు పేద ప్రజలు గ్రామ అబాధి భూములలో మరియు ప్రభుత్వ భూములలో పూరి గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు వారికి పట్టాలు ఎలా ఉంటాయి అని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.రాష్ర్ట ప్రభుత్వం మద్యం దుకాణాల ధరకాస్తు గడువు 15 రోజులు పెట్టి గృహ లక్ష్మి గడువు 3 రోజులు పెట్టడం విడ్డూరం అని అన్నారు. ప్రభుత్వానికి మద్యం దుకాణాల మీద ఉన్న ప్రేమ పేద ప్రజల నివాస గృహాల పైన లేదు అని అన్నారు.ప్రభుత్వం వెంటనే గడువు పెంచాలని అట్టి నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళన చేస్తాం అని ఆయన హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking