సిద్దార్థ్ విద్యా సంస్థలలో ఎన్నికల నిర్వహణ

 

మెదక్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ పట్టణంలోని వెంకట్ రావు నగర్ కాలనీలోని సిద్ధార్థ్ మాడల్ హైస్కూల్ లో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల సారథులను ఎన్నుకున్నారు. బాలుర క్యాప్టన్ విశాల్, బాలికల క్యాప్టన్ గా అమూల్య కీర్తన, బాలుర వైస్ క్యాప్టన్ సుమన్ సాయి స్మరన్, బాలికల వైస్ క్యాప్టన్ అర్చన ఎన్నికయ్యారు. అదే విధంగా ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ హౌస్ విభాగాలకు క్యాప్టెన్లను ఎన్నుకున్నారు. అలాగే వివిధ బ్రాంచీలలో క్యాప్టన్, వైస్ క్యాఫ్టన్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ విద్యా సంస్థల చైర్మన్ కె. శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ.. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ ఎన్నికలు నిర్వహించడ జరిగిందన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించేదుకు, భవిష్యత్తులో సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ద బడతారని, ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచీల ప్రిన్సిపాల్స్, ఇంచార్జీలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking