కీసర ఎంపీడీవో రమాదేవి మృతి ఎంతో బాధాకరం

 

ప్రజావాణి హాల్లో ఎంపీడీవో మృతి పట్ల నివాళులర్పించిన జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా అధికారులు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 17:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసర ఎంపీడీవో రమాదేవి గుండెపోటుతో మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆమె ఆత్మకు శాంతి కలగాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం గుండెపోటుతో కీసర ఎంపీడీవో రమాదేవి మృతి చెందగా సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ఆమె మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ కీసర ఎంపీడీవో రమాదేవి ఆరు నెలల క్రితం బదిలీపై వచ్చారని ఆ మండలంలో అభివృద్ధి పనులకు తన సేవలందించారని ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలాభివృద్ధికి కృషి చేసి కొద్దికాలంలోనే అందరి మన్ననలు పొందారని అన్నారు. కీసర మండలానికి మంచి సేవలందించడంతో పాటు ప్రజలు, అధికారుల మన్ననలు పొందిన ఆమె ఆకస్మిక మృతి తీరనిలోటు అని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్య నాయక్,డి ఆర్ డి ఎ పద్మజారాణి, డిసిఓ .శ్రీనివాస్ మూర్తి , జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు మౌనం పాటించి నివాళులర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking