ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు:జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

 

మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 17:
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలోనిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లా లో వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి లింగ్య నాయక్,డి ఆర్ డి ఎ పద్మజారాణి తో కలిసి 83 దరఖాస్తులను స్వీకరించారు
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking